తొలి పరిచయం

ప్రియ పాటకులారా, నా పేరు రవి కుమార్ ముర్రు. నాకు నాణేల సేకరణ (Collection Of Coins) అంటే చాల ఇష్టం. ఇది నా అలవాటు. దీన్నేఆంగ్లం లో numismatics అంటారు. నాకు తెలియకుండానే నా బాల్యం నుండి ఈ అలవాటు వుంది. నేను చాలా నాణేలు సేకరించాను. అందులో బ్రిటిష్ ఇండియా నాణేలు, మన రిపబ్లిక్ ఇండియా నాణేలు, పర దేశ నాణేలు వున్నాయి.
ఈ మొత్తం నానేలతో 2010 లో ఒక బ్లాగు సిధం చేసాను. అదే
కానీ నాకు ఏదో అసంతృప్తి గా అనిపించింది. మన మాతృ భాష లో నాణేల మీద ఏ website దొరకలేదు.
అందుకే ఇంగ్లీష్ లో ఉన్న నా wesite ని తెలుగు లో కూడా run చేధాం అనిపించింది. వెంటనే ఫెబ్రవరి ౨౦౧౧(2011) లో నాణేల మీద తెలుగు website కి నాంది పలికాను. ఈ విధంగా ఆవిష్కరించబదినదే ఈ వెబ్సైటు.
ఈ బ్లాగు మీద పాటకుల యొక్క సలహాలు, సూచనలను మనసారా ఆహ్వానిస్త్గున్నాను.
ధన్యవాదాలు.

ఇట్లు
రవికుమార్ ముర్రు

24 ఫిబ్ర, 2011

తెలుగు లిపి లో వున్న అరుదైన ఒక అణా నాణెం




         ఈ నాణెం నా సేకరణలలో ఒకటైనది మరియు నాకు మా పాత ఇంటిలో దొరికినది.  దీని ప్రత్యేకత  "తెలుగులో కూడా అక్షరాలూ వ్రాసి వుండడం".
బొమ్మ:
          బొమ్మ వైపు జార్జి VI రాజు యొక్క చిత్రం ముద్రించబడి వుంటుంది. ఇంకా GEORGE VI KING EMPEROR అని  ఇంగ్లీష్ లో ముద్రించబడి వుంటుంది.
బొరుసు :
          బొరుసు వైపు మధ్యలో 1 ANNA అని వుండి, దానికి పైన INDIA అని మరియు క్రింద 1939 అని ఉండును. 1939 కి క్రింద mint mark "." గుర్తు  ఉండును. 1 ANNA కి నలుగు వైపులా 4 భాషలు ముద్రించి ఉండును. అవి clockwise లో  బెంగాలీ, ఉర్దూ, తెలుగు మరియు హిందీ.

1 కామెంట్‌:

  1. బాగుందుండి, మీ బ్లాగ్. వర్డ్ వెరిఫికేషన్ తీసేయండి, కామెంట్ సులభంగా పెట్టచ్చు.

    రిప్లయితొలగించండి